రామ్ చరణ్ బాలీవుడ్ పైనే కాన్సంట్రేట్ చేశాడా!!

ఆర్ ఆర్ ఆర్ సినిమా తో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న రామ్ చరణ్ ఇప్పుడు బాలీవుడ్ కాన్సంట్రేషన్ చేశాడని అయన చేస్తున్న పనులను బట్టి తెలుస్తుంది. చరణ్ ఇటీవలే ఎక్కువగా బాలీవడ్ లోనే తిరుగుతున్నాడు. అక్కడి వారితో కలిసిపోవడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు. అక్కడి ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాడు.

తాజాగా బాలీవుడ్ ఖిలాడీ అక్షయ్ కుమార్ తో కలిసి ఓ కార్యక్రమంలో పాల్గొన్న రామ్ చరణ్ షాకింగ్ విషయాల్ని వెల్లడించడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఈ సందర్భంగా అక్షయ్ కుమార్ తో పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన రామ్ చరణ్ తనకు తెలుగు డైరెక్టర్లతో మాత్రమే కలిసి పని చేయాలని లేదని గుజరాతీ బెంగాళీ డైరెక్టర్లతో కూడా కలిసి పని చేయాలని వుందని వారు కూడా మంచి మంచి సినిమాలు చేస్తున్నారని చెప్పడంతో మెగా ఫ్యాన్స్ షాక్ అవుతున్నారట.

ఇక అయన ఇప్పుడు శంకర్ దర్శకత్వంలో సినిమా చేస్తుండగా ఆ తర్వాత ప్రశాంత్ నీల్ లేదా ఓ బాలీవుడ్ దర్శకుడితో సినిమా చేసే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.