రానా కి ఇంకా టైం పడుతుందా?

రానా హీరో గా సినిమాలు లేకపోవడం ఇప్పుడు అందరిని నిరాశపరుస్తుంది. బాహుబలి సినిమా తో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈ హీరో సోలోగా ప్రేక్షకులను అలరించే ఎన్నో సినిమాలు చేశారు. ఇటీవలే విరాటపర్వం సినిమా తో వచ్చి విజయాన్ని అందుకున్న ఈ హీరో ఇప్పుడు సినిమా ను సెట్స్ మీద పెట్టలేకపోవడం నిరాశను మిగులుస్తుంది.

ఇంకోవైపు వరుస సినిమాలలో చేస్తున్నాడు రానా. అయితే అవి హీరో గా కాదు. బాబాయ్ వెంకటేష్ తో నెట్ ఫ్లిక్స్ కోసం ‘రానా నాయుడు’ వెబ్ సిరీస్ లో నటించాడు. ఫేమస్ అమెరికన్ క్రైమ్ డ్రామా ‘రే డొనోవన్’ ఆధారంగా ఈ సిరీస్ ని నిర్మించారు.

బీవీఎస్ రవి స్క్రీన్ ప్లే అందించిన ఈ సిరీస్ ని కరణ్ అన్షుమన్ క్రియేట్ చేయగా సుపర్ణ వర్మ కరణ్ అన్షుమన్ డైరెక్ట్ చేశారు. ఇటీవలే టీజర్ ని విడుదల చేశారు. త్వరలో తెలుగు హిందీ భాషల్లో ఈ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది. దీని తరువాతైనా రానా తన కొత్త ప్రాజెక్ట్ ని ప్రకటిస్తాడేమో చూడాలి.