రష్మిక బాలీవుడ్ సినిమాలు చేయదా!!

టాలీవుడ్ టాప్ హీరోయిన్ రష్మిక మందాన ఇప్పుడు తెలుగులో పుష్ప 2 సినిమా తప్పా మరే సినిమా కూడా ఒప్పుకోలేదు. కొన్ని సినిమాలలో నటించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. అయితే మొదటినుంచి ఆమె ఒకే భాషలోని సినిమాలను నమ్ముకోలేదు.

వివిధ భాషలలో సినిమాలు చేస్తూ వచ్చింది. అందుకే ఆమెకు కన్నడ, బాలీవుడ్ భాషలలో కూడా మంచి గుర్తింపు ఉంది. అయితే బాలీవుడ్ లో ఆమె సినిమాలు ఫ్లాప్ అవుతుండడం ఆమెకు మరిన్ని అవకాశాలను తీసుకురావడం లేదు. అర్జున్ రెడ్డి డైరెక్టర్ సందీప్ వంగ చేస్తున్న యానిమల్ సినిమా పైనే ఆమె ఆశలు పెట్టుకుంది.

ఈ నేపథ్యంలో ఈ సినిమా తర్వాత నేషనల్ క్రష్ రష్మిక బాలీవుడ్ సినిమాల విషయంలో పర్ఫెక్ట్ ప్లానింగ్ తో వెళ్లాలని చూస్తుంది. అక్కడ సక్సెస్ సాధిస్తే మాత్రం ఈమెకు కొన్ని సంవత్సరాలు తిరుగులేదని చెప్పాలి.