రంజితమే తెలుగు పాట ఎప్పుడంటే?

తమిళ్ సూపర్ స్టార్ విజయ్ హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో దిల్ రాజు నిర్మిస్తున్న వారసుడు. మహర్షి సినిమా తర్వాత వంశీ పైడిపళ్ళు చేస్తున్న ఈ సినిమా విడుదలకు సిద్ధం అవుతోంది. సంక్రాంతికి విడుదల కాబోతున్నఈ వారసుడు సినిమా నుండి ఒక్కొక్కటి చొప్పున పాటలను విడుదల చేసేందుకు సిద్ధం అవుతున్నారు.

ఇప్పటికే తమిళనాట ఈ సినిమా లోని రంజితమే పాట విడుదల అయ్యింది. అది ఎంత పెద్ద సంచలాన్ని సృష్టించిందో ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఇప్పుడు ఈ పాట తెలుగు వెర్షన్ ను విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నారు.

ఈ రంజితమే అనే పాటను ఈనెల 30వ తారీఖున విడుదల చేసేందుకు సిద్ధం అయ్యారు.థమన్ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమా లోని పాట ఏ స్థాయి లో హిట్ అవుతుందో చూడాలి. ఈ సినిమా లో విజయ్ సరసన రష్మిక హీరోయిన్ గా నటిస్తుంది.