అఖండ తర్వాత వీరసింహ రెడ్డి సినిమా చేస్తున్న బాలకృష్ణ ఇప్పుడు ఆ తర్వాత సినిమా చేయడానికి రంగం సిద్ధం చేస్తున్నాడు. ఇప్పటికే ప్రకటన చేసుకున్న ఈ సినిమా డిసెంబర్ 8న బాలకృష్ణ అనీల్ రావిపుడి మూవీ సెట్స్ మీదకు వెళ్తుందని తెలుస్తుంది.
12 రోజుల పాటు జరిగే ఈ తొలి షెడ్యూల్ లో హై వోల్టేజ్ యాక్షన్ ఎపిసోడ్ షూట్ చేస్తారట. అనీల్ రావిపుడి ఇప్పటివరకు చేసిన సినిమాలన్ని ఎంటర్టైనింగ్ గా ఉన్నాయి. ఫస్ట్ టైం కెరీర్ లో ఫుల్ లెంగ్త్ మాస్ మూవీ చేస్తున్నాడు అనీల్ రావిపుడి. అయితే ఈ మూవీలో బాలయ్య మార్క్ మాస్ అంశాలు ఉన్నా సినిమా మాత్రం తన పంథాలో ఎంటర్టైనింగ్ గా సాగుతుందని అంటున్నారు.
బాలయ్యతో సినిమా వేరే లెవల్ అంటూ ఊరిస్తున్న డైరెక్టర్ అనీల్ రావిపుడి ఫస్ట్ షెడ్యూల్ తోనే యాక్షన్ సీన్స్ తో అదరగొట్టేస్తున్నాడు. ఈ యాక్షన్ సీన్స్ కూడా రెగ్యులర్ బాలకృష్ణ సినిమాల్లో ఉండేలా కాకుండా అనీల్ కొత్తగా ప్లాన్ చేస్తున్నాడట.