మారుతి కథ ను అఖిల్ విన్నాడా!!

ఏజెంట్ సినిమా తో సంక్రాంతి కి ప్రేక్షకుల ముందుకు రాబోతున్న అఖిల్ తన తదుపరి సినిమాలకి సంబంధించి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో మారుతి కథ ను అఖిల్ విన్నాడు అనే వార్తలు ఇప్పుడు వినిపిస్తున్నాయి. ప్రభాస్ తో సినిమా చేస్తున్న మారుతి కోసం ఇప్పుడు చాలామంది హీరోలు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇంత వరకూ మారుతి టాప్ స్టార్లని డైరెక్ట్ చేయలేదు.

మీడియం రేంజ్ హీరోలతోనే పనిచేసాడు. తొలిసారి పాన్ ఇండియా స్టార్ ని డైరెక్ట్ చేసే అవకాశం వచ్చింది. ఈ ఛాన్స్ ని సద్వినియోగం చేసుకోగల్గితే గనుక మారుతి రేంజ్ మారిపోతుంది. ఒక్క హిట్ తో పాన్ ఇండియాలో ఫేమస్ అయిపోతాడు. ఆ విధంగా మారుతి తో తదుపరి సినిమా ను చేసే విధంగా అఖిల్ ప్రయత్నాలు చేస్తున్నాడు. మరి ఈ కథ విషయంలో అఖిల్ ఆవిధంగా రియాక్ట్ అవుతాడో చూడాలి.