మహేష్ బాబు త్రివిక్రమ్ సినిమా రిలీజ్ డేట్ మారబోతుందా!!

మహేష్ బాబు త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. అతడు, ఖలేజా సినిమాలకు బిన్నంగా ఈ మూవీ ఉండనుందని తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమా పూజాకార్యక్రమాలు జరిగాయి. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ను ఇప్పటికే మొదలుపెట్టగా ఒక షెడ్యూల్ ను కూడా పూర్తి చేశారు.

ఈ సినిమాలో హీరోయిన్ గా పూజాహెగ్డే నటిస్తోంది. ఈ సినిమాకు మ్యూజిక్ సెన్సేషన్ తమన్ సంగీతం అందించనున్నారు. అలాగే ఈ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా పెళ్ళిసందడి బ్యూటీ శ్రీలీల నటిస్తుందని టాక్.

అయితే సినిమా ను అనౌన్స్ చేసినప్పుడే ఈ చిత్రాన్ని ఏప్రిల్ 28 న విడుదల చేయబోతున్నారని అనౌన్స్ చేశారు. అయితే ఇప్పుడు షూటింగ్ ఆలస్యం కావడం వల్ల ఈ చిత్రం విడుదల కూడా ఆలస్యం అవుతుందని అందరు భావించారు. అయితే దీనిపట్ల చిత్ర బృందం క్లారిటీ ఇచ్చింది. దాదాపుగా అదే తేదీన సినిమా ను విడుదల చేస్తారని చెబుతున్నారు.