మలైకా గర్భవతి.. కోప్పడ్డ ప్రియుడు!!

సోషల్ మీడియా లో ఎలాంటి బేస్ లేకుండా కొన్ని వార్తలు ప్రచారం అవుతుంటాయి. అలాంటిదే మలైకా అరోరా ప్రెగ్నెంట్ అనే వార్త. నిన్నటినుంచి అందరు దీని గురించే చర్చ జరుపుతున్నారు. 37 ఏళ్ల అర్జున్ తనకంటే 12 ఏళ్లు పెద్దదైన మలైకా అరోరాతో ప్రేమలో ఉన్నాడు.

ఈ ఇద్దరూ చాలా కాలం నుంచి సహజీవనం చేస్తున్నారు. సల్మాన్ ఖాన్ తమ్ముడు అర్బాజ్ ఖాన్ తో 2017లో విడాకులు తీసుకున్న మలైక.. బోనీ కపూర్ మొదటి భార్య కుమారుడైన అర్జున్ ప్రేమలో పడటం అప్పట్లో చర్చనీయాంశమైంది. అయితే మొదట్లో ఇది రూమర్ అనుకున్న ఆ తర్వాత వారి ఫోటోలు నిజం తెలిసేలా చేశాయి.

అయితే తాజాగా ఆమె ప్రెగ్నెంట్ అనే వార్త రావడం అర్జున్ కపూర్ ను తీవ్ర కోపాన్ని కలుగజేసింది. వార్త స్క్రీన్ షాట్ ను సోషల్ మీడియాలో షేర్ చేసిన అర్జున్.. ఇలాంటి పనికిరాని రాతల వల్ల మేం ఎంతలా ఇబ్బందిపడతామో మీకు తెలుసా? అని ప్రశ్నించాడు.