“పొలిమేర” చిత్ర దర్శకుడు డా. అనిల్ విశ్వనాథ్ మొదటి సినిమా “28°C” నుంచి ‘చెలియా చెలియా..’ లిరికల్ సాంగ్ రిలీజ్, ఈ నెల 28న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న మూవీ

 

“పొలిమేర” చిత్రం విజయంతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు దర్శకుడు డా. అనిల్ విశ్వనాథ్. ఆయన దర్శకత్వం వహించిన మొదటి సినిమా “28°C” ఈ నెల 28న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఎమోషనల్ గా సాగే అద్భుతమైన ప్రేమ కథతో తెరకెక్కిన ఈ చిత్రంలో నవీన్ చంద్ర హీరోగా నటించగా..షాలినీ వడ్నికట్టి హీరోయిన్ గా కనిపించనుంది. “28°C” చిత్రాన్ని వీరాంజనేయ ప్రొడక్షన్స్ బ్యానర్ పై ప్రొడ్యూసర్ సాయి అభిషేక్ నిర్మిస్తున్నారు. ఈ రోజు ఈ సినిమా నుంచి ‘చెలియా చెలియా..’ లిరికల్ సాంగ్ రిలీజ్ చేశారు.

‘చెలియా చెలియా..’ లిరికల్ సాంగ్ ను మ్యూజిక్ డైరెక్టర్ శ్రావణ్ భరద్వాజ్ బ్యూటిఫుల్ గా కంపోజ్ చేయగా…కిట్టు విస్సాప్రగడ మంచి లిరిక్స్ అందించారు. సింగర్ రేవంత్ ఆకట్టుకునేలా పాడారు. ‘చెలియా చెలియా..’ పాట ఎలా ఉందో చూస్తే – ‘నీ నగుమోము కనులారా, చూస్తుంటే క్షణమైనా, కనురెప్ప వాలేనా, నా కనుసైగ నీ వెనకా, వెంటాడే మౌనంగా, వేచిందే నువు రాక, ఊహలలో ఊరిస్తూ, దాగినది చాలుగా, ఊరటగా నా ఎదురు నా జతగా రా, చెలియా చెలియా నిన్ను చూడంగ, చెలియా చెలియా కనులు చాలవుగా..’ అంటూ మంచి లవ్ ఫీల్ తో సాగుతుందీ పాట.

మనసును తాకే భావోద్వేగాలతో ఆద్యంతం సాగే అద్భుతమైన ప్రేమ కథా మూవీ ఇదని చిత్ర దర్శకుడు డా. అనిల్ విశ్వనాథ్ తెలిపారు. ఈ చిత్రంతో హీరో నవీన్ చంద్ర మరోసారి ఎమోషనల్ ప్రేమకథలో తన నటనతో ఆకట్టుకోబోతున్నాడు. లవ్ స్టోరీ మూవీలో ఉండాల్సిన అన్ని ఎమోషన్స్ తో “28°C” సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. టెంపరేచర్ కథలో ఎంత కీ రోల్ ప్లే చేస్తుంది అనేది, ఒక డిఫరెంట్ స్టోరీ స్క్రీన్ ప్లేతో ఈ సినిమా తెరకెక్కింది. “28°C” సినిమా అన్ని వర్గాల ప్రేక్షకుల ఆదరణ పొందుతుందని మేకర్స్ నమ్మకంతో ఉన్నారు.

నటీనటులు – నవీన్ చంద్ర, షాలినీ వడ్నికట్టి, వి జయప్రకాష్, ప్రియదర్శి పులికొండ, హర్ష చెముడు, రాజా రవీంద్ర, అభయ్ బేతిగంటి, దేవియాని శర్మ, సంతోషి శర్మ, తదితరులు

టెక్నికల్ టీమ్

కాస్ట్యూమ్స్ – అనూష ఇరగవరపు, అభినయ చౌదరి, రేఖ బొగ్గరపు
ఎడిటర్ – గ్యారీ బీహెచ్
డీవోపీ – వంశీ పచ్చిపులుసు
బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ – శ్రీచరణ్ పాకాల
మ్యూజిక్ – శ్రావణ్ భరద్వాజ్
బ్యానర్ – వీరాంజనేయ ప్రొడక్షన్స్
కో ప్రొడ్యూసర్స్ – సంజయ్ జూపూడి, విక్రమ్ జూపూడి
ప్రొడ్యూసర్ – సాయి అభిషేక్
పీఆర్ఓ – జీఎస్ కే మీడియా (సురేష్ – శ్రీనివాస్)
దర్శకత్వం – డా. అనిల్ విశ్వనాథ్