పొన్నియన్ సెల్వన్ రెండో భాగం ఎప్పుడు విడుదల తేదీ?

మణిరత్నం దర్శకత్వంలో రూపొందిన పీరియాడిక్ డ్రామా పొన్నియన్ సెల్వన్ సినిమా మొదటి భాగం ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. మూడు భాగాలుగా రానున్న ఈ సినిమా లో విక్రమ్, కార్తీ, జయం రవి హీరోలు నటించగా ఇప్పుడు అందరు ఈ సినిమా యొక్క రెండవ భాగం కోసం ఎదురుచూస్తున్నారు.

పొన్నియన్ సెల్వన్ పార్ట్ 2 వచ్చే ఏప్రిల్ 28న థియేటర్లలోకి వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం పార్ట్ 2 పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. ట్రేడ్ రిపోర్ట్స్ ప్రకారం ఈ సినిమా వేసవి సెలవుల్లో అంటే ఏప్రిల్ 28న విడుదలవుతుందని సమాచారం. ఇది సినీ అభిమానులను ఎంతో సంతోషపరిచే విషయం అని చెప్పాలి.

ప్రకాష్ రాజ్, జయరామ్, శరత్ కుమార్, ప్రభు, ఐశ్వర్యలక్ష్మి, శోభిత ధూళిపాళ, విక్రమ్ ప్రభు సహాయక పాత్రల్లో కనిపించారు. రెహమాన్ ఈ సినిమా కి సంగీతం సమకూరుస్తున్నారు.