పవన్ కి ఆ సినిమా చేసే ఉద్దేశ్యం ఉందా!!

పవన్ కళ్యాణ్ హీరో గా హరిహర వీరమల్లు సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. క్రిష్ దర్శకుడు. అక్టోబర్ నుంచే తాజా షెడ్యూల్ ని ప్రారంభించబోతున్నారు. ఈ మూవీ షూటింగ్ ని పూర్తి చేసి ఆ తరువాత పవన్ ఏ సినిమా చేస్తున్నాడో అన్న విషయం ఇప్పుడు అయోమయం గా ఉంది. చాలా సినిమాలు పవన్ చేయాల్సినవి ఉన్నాయి. హరీష్ శంకర్ సినిమా చేయాల్సి ఉండగా, సముద్ర ఖని దర్శకత్వంలోని సినిమా కూడా చేయాల్సి ఉంది. తాజాగా పవన్ చేసే సినిమాల జాబితాలో మరో రీమేక్ మూవీ కూడా ఉంది.

ఈ సినిమా కోసం పవన్ డేట్స్ ని కేటాయించనున్నారట. ‘సాహో’ ఫేమ్ సుజీత్ డైరెక్షన్ లో ‘తేరీ’ రీమేక్ ని చేయబోతున్న విషయం తెలిసిందే. గత కొన్ని నెలలుగా డిలే అవుతూ వస్తున్న ఈ ప్రాజెక్ట్ మొత్తానికి పట్టాలెక్కుతున్నట్టుగా తెలుస్తోంది. ఇందులో ఎంతవరకు నిజం ఉందొ తెలీదు కానీ ఎలేచ్షన్స్ కు ముందు పవన్ నాలుగు సినిమాలు చేయాలి. పవన్ కళ్యాణ్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో కూడా ఓ సినిమా చేయాల్సి ఉంది.