పవన్ కళ్యాణ్ ఇప్పుడైనా ముగించేనా!!

పవన్ కళ్యాణ్ ఎప్పుడో మొదలుపెట్టిన హరిహర వీరమల్లు సినిమాను త్వరగా పూర్తి చేయాలనీ అయన అభిమానులు కోరుకుంటున్నారు. 17వ శతాబ్దం నేపథ్యంలో మొఘల్ సామ్రాజ్య కాలం నాటి కథతో ఈ మూవీని రూపొందిస్తున్నారు. గతంలో ఇలాంటి సినిమా చేసి సక్సెస్ సాధించిన క్రిష్ ఈ సినిమా కి దర్శకత్వం అందిస్తున్నారు.

కోవిడ్ కి ముందు మొదలైన ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ గత కొన్ని నెలలుగా ఆగుతూ సాగుతూ వస్తోంది. ఈ నేపథ్యంలో పవన్ ఈ సినిమా కి డేట్స్ కేటాయించగా ఇంకా మలిదశ షూటింగ్ మొదలు కావట్లేదు. ఇది పవన్ అభిమానులను నిరాశపరుస్తుంది.

పవన్ కల్యాణ్ తన కెరీర్ లో నటిస్తున్న తొలి పీరియాడిక్ పాన్ ఇండియా మూవీ ఇది. అందుకే అయన అభిమానులు ఈ సినిమా ను ఎప్పుడెప్పుడు చూద్దామా అన్నట్లు ఎదురుచూస్తున్నారు. మరి త్వరగా పవన్ ఈ సినిమా పూర్తి చేయాలనీ కోరుకుందాం. ఈ సినిమా తర్వాత పవన్ చేయవలసిన తదుపరి సినిమాలు పూర్తిగా క్యాన్సర్ అయ్యాయని అంటున్నారు.