టాలీవుడ్ హీరోయిన్ తమన్నా భాటియా పెళ్లి చేసుకోబోతుంది అంటూ వార్తలు సోషల్ మీడియా లో తెగ హల్చల్ అవుతున్నాయి. ముంబైకి చెందిన ఓ వ్యాపారవేత్తను ఆమె పెళ్లి చేసుకోబోతోందని, త్వరలోనే ఆమె పెళ్లి తేదీని వెల్లడిస్తుందని ప్రచారం అవుతుంది.
హ్యాపీ డేస్ సినిమా తో తెలుగు తెరకు పరిచయమైనా ఈ ముద్దుగుమ్మ ముంబై నగరవాసి. టాలీవుడ్ లో అతి తక్కువ కాలంలోనే సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది.ప్రస్తుతం ‘భోళా శంకర్’ చిత్రంలో చిరంజీవికి జోడీగా నటిస్తోంది. దీంతోపాటు, ఓ తమిళ చిత్రాన్ని కూడా చేస్తోంది.
అయితే ఈ చిత్రాల తర్వాత ఆమె సినిమాలు ఒప్పుకోకపోవడానికి కారణం ఆమె పెళ్లి చేసుకోవడమేనట. ఇందులో ఎంతవరకు నిజం ఉందో లేదో తెలియదు.అయితే ఇంతవరకు తమన్నా ఖండించలేదు. దీంతో, పెళ్లి వార్త నిజమేనని నెటిజెన్లు ఒక క్లారిటీకి వస్తున్నారు. త్వరలోనే పెళ్లికి సంబంధించిన అధికారిక ప్రకటన వస్తుందని అంటున్నారు