టాలీవుడ్ స్టార్స్ కి ఎందుకు ఇన్ సెక్యూరిటీ!!

టాలీవుడ్ స్టార్ హీరోలలో ఇప్పుడు రోజు రోజు కి ఇన్ సెక్యూరిటీ పెరిగిపోతుందని చెప్పాలి. ఒక సినిమాను ఒప్పుకున్నా కొద్దీ రోజులకే ఏమాత్రం తేడా వచ్చినా దాన్ని పూర్తిగా పక్కన పెట్టేస్తున్నారు. దాంతో దర్శక నిర్మాతలు ఎంతో ఇబ్బంది పడుతున్నారు. పాన్ ఇండియా సినిమాలు బిగ్ బడ్జెట్ సినిమాలు స్ట్రాంగ్ గానే మొదలవుతున్నప్పటికీ కూడా షూటింగ్ దశలోకి వచ్చే వరకు మాత్రం అవి ఎగిరిపోతున్నాయి. చిన్న ఇబంది వచ్చినా కూడా హీరో లు వాటిని రిజెక్ట్ చేయడం ఏమాత్రం ఆలోచించడం లేదు.

విడుదల లు ఆలస్యం అవుతుండడం, అనౌన్స్ అయినా తేదీలను మార్చడం వంటివి జరగడం ఇతర సినిమాలపై ఎంతో ఎఫెక్ట్ చూపిస్తుంది. పవన్ కళ్యాణ్ మాత్రం ఒప్పుకున్న సినిమాలను కూడా క్యాన్సిల్ చేసుకుంటున్నాడు. హరిష్ శంకర్ తో భవదీయుడు భగత్ సింగ్ అనే సినిమా చేయాల్సింది. అలాగే సురేందర్ రెడ్డితో కూడా ఒక సినిమా చేయాలని అనుకున్నాడు. ఈ రెండు సినిమాలు దాదాపుగా ఉండవనే తెలుస్తుంది. ఈ విధంగా టాలీవుడ్ అగ్ర హీరోలు కాస్త బ్యాడ్ టైం ఎదుర్కొంటున్నారు అనే చెప్పాలి.ఒకే చెప్పిన సినిమాలు క్యాన్సర్ అవడం నిజంగా ఎవరికైనా ఇబ్బందే.