కేజిఎఫ్ సినిమా ఎంతటి సంచలనాత్మక విజయాన్ని అందుకుందో అందరికి తెలిసిందే. టాక్ పరంగా మాత్రమే కాదు వసూళ్ల సునామి కూడా సృష్టించింది ఈ సినిమా. ఆ విధంగా కేజిఎఫ్ సినిమా తర్వాత ఆ స్థాయి లో కలెక్షన్స్ సాధించే సినిమా ఇప్పట్లో రాదని అందరు అనుకున్నారు. కానీ అలాంటి సినిమాలు కాకపోయినా అలాంటి కలెక్షన్స్ సాధించిన సినిమాలు మాత్రం ఇప్పుడు వచ్చాయి.
కాంతారా ఇప్పటివరకు 76 కోట్ల నికర ఆదాయం రాబట్టింది. ఈ చిత్రానికి బ్రేక్ ఈవెన్ కేవలం 7.50 కోట్లు. కాబట్టి రిటర్న్స్ ప్రకారం రాబడులు 913.33 శాతం వద్ద ఉన్నాయి. ఈ చిత్రం అతి త్వరలో 1000 శాతం రిటర్నులతో సెన్సేషన్ అవుతుందని భావిస్తున్నారు.
ఇక కాశ్మీర్ ఫైల్స్ కూడా 1000 శాతం రిటర్న్స్ తో బయ్యర్లకు ఊహించని ట్రీటిస్తోంది. ఏదేమైనా ఇలాంటి చిన్న సినిమాలు భారీ కలెక్షన్స్ ను అందుకోవడం విశేషం.