“కాలమేగా కరిగింది” సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ ‘ఊహలోన ఊసులాడే…’ రిలీజ్

వినయ్ కుమార్, శ్రావణి మజ్జరి, అరవింద్ ముదిగొండ, నోమిన తార ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా “కాలమేగా కరిగింది”. ఈ సినిమాను సింగార క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ పై మరే శివశంకర్ నిర్మిస్తున్నారు. సింగార మోహన్ దర్శకత్వం వహిస్తున్నారు. త్వరలో “కాలమేగా” కరిగింది సినిమా థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ రోజు ఈ సినిమా నుంచి ‘ఊహలోన ఊసులాడే..’ పాటను విడుదల చేశారు.

 

‘ఊహలోన ఊసులాడే..’ పాటను మ్యూజిక్ డైరెక్టర్ గుడప్పన్ బ్యూటిఫుల్ గా కంపోజ్ చేయగా..సింగార మోహన్ క్యాచీ లిరిక్స్ రాశారు. సాయి మాధవ్, ఐశ్వర్య దరూరి ఆకట్టుకునేలా పాడారు. ఊహలోన ఊసులాడే పాట ఎలా ఉందో చూస్తే – ‘పూల వాననా వాలుతుంది మీన, రాగమేళమా కూయమంది కూన, వాయు వేగమా తరుముతుంది లోన, ఈ వేళలో.. గాలి వానలే రాలుతున్న బాట, నీలి వెన్నెలే తాకుతున్న పూట, వాలు కన్నులే లాగుతున్న చోట, ఉండాలనే నా ధ్యాస, ఊహలోన ఊసులాడే..’ అంటూ సోల్ ఫుల్ మెలొడీగా సాగుతుందీ పాట.

 

 

నటీనటులు – వినయ్ కుమార్, శ్రావణి మజ్జరి, అరవింద్ ముదిగొండ, నోమిన తార , తదితరులు

 

టెక్నికల్ టీమ్

రచన దర్శకత్వం – సింగార మోహన్

ప్రొడ్యూసర్ – మరే శివశంకర్

బ్యానర్ – సింగార క్రియేటివ్ వర్క్స్

డీవోపీ – వినీత్ పబ్బతి

ఎడిటర్ – రా యోగేష్

మ్యూజిక్ డైరెక్టర్ – గుడప్పన్

పీఆర్ ఓ- జీఎస్ కే మీడియా (సురేష్ – శ్రీనివాస్)