అందరి అంచనాలను నిజం చేస్తూ ఆహా ఓటీటీలో ‘హోం టౌన్’ వెబ్ సిరీస్ అనూహ్యమైన స్పందన తెచ్చుకుంటోంది. ఈ నెల 4వ తేదీ నుంచి స్ట్రీమింగ్ అవుతున్న ఈ వెబ్ సిరీస్ 100 మిలియన్ ఫ్లస్ మినిట్స్ వ్యూయర్ షిప్ సాధించింది. ఈ రోజు ఆహా ఈ రేర్ ఫీట్ ను అనౌన్స్ చేస్తూ తమ హ్యాపీనెస్ షేర్ చేసుకుంది. స్మాల్ టౌన్ లోని ఓ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ లైఫ్ ను ఎంతో సహజంగా ఆకట్టుకునేలా చూపించింది ‘హోం టౌన్’ వెబ్ సిరీస్. ఈ వెబ్ సిరీస్ రాబోయే రోజుల్లో మరింత సక్సెస్ ను అందుకోనుంది.
‘హోం టౌన్’ వెబ్ సిరీస్ లో రాజీవ్ కనకాల, ఝాన్సీ, ప్రజ్వల్ యాద్మ, సాయిరామ్, అనీ, అనిరుధ్, జ్యోతి కీలక పాత్రల్లో నటించారు. శ్రీకాంత్ రెడ్డి పల్లే దర్శకత్వం వహించారు. నవీన్ మేడారం అఫీషియల్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై నవీన్ మేడారం, శేఖర్ మేడారం నిర్మించారు. సొంత ఊరితో మనకున్న అనుబంధాల, జ్ఞాపకాల నేపథ్యంతో తెరకెక్కిన ఈ సిరీస్ లో ఝాన్సీ, అనీ, రాజీవ్ కనకాల, ప్రజ్వల్ యాద్మ తమ పర్ ఫార్మెన్స్ లతో మెస్మరైజ్ చేస్తున్నారు. టీనేజ్ ప్రేమ, చిన్ననాటి స్నేహాలు, కుటుంబ సభ్యుల మధ్య ఉండే అనుబంధాలు..ఇలాంటి అన్ని భావోద్వేగాలను కలిపిన కథతో ‘హోం టౌన్’ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటోంది.