ఆహా ఓటీటీలో మే 1 నుంచి స్ట్రీమింగ్ కు వస్తున్న “వేరే లెవల్ ఆఫీస్ రీలోడెడ్”

తెలుగువారి ఫేవరేట్ ఓటీటీ ఆహాలో స్ట్రీమింగ్ అయిన సక్సెస్ ఫుల్ వెబ్ సిరీస్ “వేరే లెవెల్ ఆఫీస్” ఇప్పుడు రీలోడెడ్ వెర్షన్ తో మరింతగా ఎంటర్ టైన్ చేసేందుకు సిద్ధమవుతోంది. ఈ సిరీస్ ను పోలూరు ప్రొడక్షన్స్ నిర్మించింది. జొనాథన్ ఎడ్వర్డ్స్ దర్శకత్వం వహించారు. బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 విజేత నిఖిల్ మల్యక్కల్ నటించిన వేరే లెవెల్ ఆఫీస్ రీలోడెడ్ వెర్షన్ మే 1వ తేదీ నుంచి ఆహాలో స్ట్రీమింగ్ కాబోతోంది.

 

మొదటి సీజన్ విజయం తర్వాత ప్రేక్షకులు రీలోడెడ్ వెర్షన్ కోసం ఎదురుచూస్తున్నారు. వారికి ఎగ్జైటింగ్ కంటెంట్ తో ప్రతి గురువారం కొత్త ఎపిసోడ్స్ ను స్ట్రీమింగ్ చేయబోతోంది ఆహా. వేరే లెవల్ ఆఫీస్ రీలోడెడ్ లో ఆఫీస్ లో జరిగే సరదా సన్నివేశాలు, మనం ఈజీగా కనెక్ట్ అయ్యే క్యారెక్టర్స్, స్టోరీలోని ట్విస్టులు ఆడియెన్స్ ను ఆకట్టుకోనున్నాయి. బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 విజేత నిఖిల్ మల్యక్కల్, వేరే లెవల్ ఆఫీస్ రీలోడెడ్ కాస్టింగ్ లో చేరడం మరింత క్రేజ్ తీసుకొస్తోంది.