ఆచార్య ఎఫెక్ట్.. వాల్తేరు వీరయ్య కు పడనుందా?

మెగా స్టార్ చిరంజీవి హీరో గా నటించిన ఆచార్య సినిమా దారుణంగా నిరాశపరిచిన విషయం తెలిసిందే. ఆ సినిమా ప్రభావం గాడ్ ఫాదర్ పైన పడింది అనడానికి నిదర్శనం ఆ సినిమా కలెక్షన్స్. అయితే ఇప్పుడు ఆ ప్రభావం వాల్తేరు వీరయ్య పైన పడనున్నదట.

బాబీ దర్శకత్వంలో చిరంజీవి హీరో గా రూపొందుతున్న ఈ సినిమా సంక్రాంతి కి రాబోతుంది. శృతి హాసన్ కథానాయికగా నటిస్తుండగా ఈ సినిమా లో మాస్ రాజా రవితేజ మరో కీలక పాత్ర లో నటిస్తున్నాడు. ఇన్ని ఎట్రాక్షన్స్ ఉన్న నేపథ్యంలో ఈ సినిమా కి మంచి బిజినెస్ అవుతుందని అందరు అనుకున్నారు.

అయితే ఈ సినిమా ను భారీగా కొనుగోలు చేసేందుకు బయ్యర్స్ భయపడుతున్నారట. కారణమేంటో తెలీదు కానీ ఈ సినిమా ను కొనడానికి బయ్యర్స్ కండిషన్స్ పెడుతున్నారట. ఆ విధంగా ఈ సినిమా ను నమ్మి కొనడానికి బయ్యర్స్ సిద్ధంగా లేరని తెలుస్తుంది. మరి ఈ సినిమా బిజినెస్ ఏ స్థాయి లో అవుతుందో చూడాలి.