అరుదైన వ్యాధితో బాధపడుతున్న హీరోయిన్ పూనమ్ కౌర్!!

టాలీవుడ్ కథానాయిక ప్రముఖ సినీ నటి పూనమ్ కౌర్ అనారోగ్య సమస్యలతో బాధ పడుతున్నట్టు తెలుస్తోంది. దీనికి సంబందించిన వార్త సోషల్ మీడియా లో హల్చల్ చేస్తుంది. తాజాగా వార్తల ప్రకారం ఆమె ఫైబ్రోమయాల్జియా అనే ఒక అరుదైన సమస్యతో ఆమె బాధపడుతోందట.

చాలారోజులనుంచి ఈ వ్యాధి ఆమెకు ఉన్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం ఆమె చికిత్స తీసుకుంటుంది. ఈ వ్యాధి ఉన్నవారు అలసటకు గురవుతారు. వారి మానసిక స్థితిలో మార్పులు వస్తాయి. కండరాల నొప్పికి గురవుతారు. నిద్ర, జ్ఞాపకశక్తి తగ్గిపోతాయి.

ప్రస్తుతం పూనమ్ కౌర్ కేరళలో ఆయుర్వేద చికిత్స తీసుకుంటోందట. సమంత కూడా ఇలాంటి ఓ అరుదైన వ్యాధి తో బాధపడుతున్న విషయం తెలిసిందే. ఆమె ఇప్పుడిప్పుడే దానినుంచి కోలుకున్తున్నారు.