‘అన్ స్టాపబుల్ 2’ ఈ ఎపిసోడ్ వెరీ స్పెషల్!!

బాలకృష్ణ హోస్ట్ గా చేస్తున్న అన్ స్టాపబుల్ షో కి మంచి ఆదరణ దక్కింది. ఇప్పుడు ఈ షో కి కొనసాగింపు అన్ స్టాపబుల్ 2 కూడా వచ్చింది. అయితే దీనికి మంచి రెస్పాన్స్ వస్తుందని చెప్పాలి. పలువురు సినీ .. రాజకీయ ప్రముఖులు ఈ వేదిక ద్వారా తమకి సంబంధించిన అనేక విషయాలను పంచుకుంటున్నారు.

మొదటి సీజన్ కంటే ఈ రెండో సీజన్ లో ఎంతో స్పెషాలిటీ ఉందని చెప్పాలి. ఈ రెండో సీజన్ లో పెద్ద పెద్ద సెలెబ్రిటీలను తీసుకువస్తున్నారు. ఈ టాక్ షోలో వచ్చే శుక్రవారం .. అంటే డిసెంబర్ 2వ తేదీన మరో ఎపిసోడ్ ను స్ట్రీమింగ్ చేయనున్నారు.

తెలుగు సినిమా చరిత్రలో దర్శకులుగా .. నిర్మాతలుగా లెజెండ్స్ అనిపించుకున్న రాఘవేంద్రరావు .. కోదండరామిరెడ్డి .. సురేశ్ బాబు .. అల్లు అరవింద్ ఈ ఎపిసోడ్ లో తమ మనోభావాలను ఆవిష్కరించనున్నారు.