అఖిల్ సినిమా కు ఇంకా కష్ఠాలు పోలేదా!!

అఖిల్ హీరో గా నటిస్తున్న సినిమా ఏజెంట్. ఏకే ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై అనిల్ సుంకర అత్యంత భారీ స్థాయిలో నిర్మిస్తున్న ఈ మూవీకి స్టైలిష్ బ్లాక్ బస్టర్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నాడు.

మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి కీలక అతిథి పాత్రలో నటిస్తున్న ఈ మూవీ షూటింగ్ గత కొన్ని నెలలుగా నత్తనడకన సాగుతోంది. ముందు ఆగస్టు 12 రిలీజ్ అన్నారు. షూటింగ్ లో హెవీ స్టంట్స్ కారణంగా అఖిల్ గాయాలు కావడంతో షూటింగ్ డిలే అవుతూ వచ్చింది.

దీంతో ఈ రీలీజ్ డేట్ ని మార్చేసి సంక్రాంతి రిలీజ్ అని ప్రకటించారు. ఆ తర్వాత ఈ సినిమా రిలీజ్ డేట్ మళ్ళీ మార్చేస్తారు. అయితే ఇప్పటికీ ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో చూడాలి. చాలా రోజులుగా ఈ సినిమా విడుదల వాయిదా పడుతూ వచ్చింది.