అక్కడ అమలా సత్తా చాటేనా !!

తెలుగు తమిళ భాషల్లో మంచి పేరు సంపాదించుకున్న అమల పాల్ ఇప్పుడు బాలీవుడ్ కి వెళ్తుందని వార్త ఆమె అభిమానులను ఎంతో సంతోషపెడుతుంది. ఆమె అక్కడ చేయబోయే తొలి సినిమా అవకాశాన్ని అజయ్ దవేగణ్ సరసన అందుకుంది. ఆయన హీరోగా …దర్శకత్వలో తెరకెక్కుతోన్న ‘బోలా’ అమలని హీరోయిన్ గా తీసుకున్నారు.

‘ఖైదీ’ సినిమాకి రీమేక్ రూపం ఇది. బాలీవుడ్ నేటివిటీకి తగ్గట్టు మార్పులు చేసి తెరకెక్కిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ కోసం అమలని ఏరికోరి మరీ ఎంపిక చేసారుట. అజయ్ రాసుకున్న పాత్రకి అమె అయితేనే న్యాయం చేస్తుందని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. నటిగా గ్లామర్ నాయికా గా మంచి గుర్తింపు సంపాదించుకున్న అమలా అక్కడ రాణిస్తుందా అనేది చూడాలి.