పలు సూపర్ హిట్ చిత్రాలకు మ్యూజిక్ అందిస్తూ సక్సెస్ ఫుల్ మ్యూజిక్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నారు గౌర హరి. ఆయన ఈరోజు తన పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఆయన మ్యూజిక్ కంపోజ్ చేసిన హనుమాన్ సినిమా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీగా ఘన విజయాన్ని అందుకుంది. పలు బాక్సాఫీస్ రికార్డులను క్రియేట్ చేసింది. ఈ సినిమాలో సాంగ్స్ ఛాట్ బస్టర్స్ అయ్యాయి. హనుమాన్ సక్సెస్ తర్వాత గౌర హరి పలు ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్స్ చేస్తున్నారు.
తేజ సజ్జ హీరోగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ రూపొందిస్తున్న మిరాయి మూవీకి మ్యూజిక్ అందిస్తున్నారు గౌర హరి. ఈ సినిమా భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా తెరకెక్కుతోంది. ఈ సినిమాతో పాటు మరో బాలీవుడ్ మూవీకి సంగీతాన్ని అందిస్తున్నారు గౌర హరి. ఈ ఇయర్ ఆయనకు స్పెషల్ గా ఉండబోతోంది. ఈ టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ మరిన్ని క్రేజీ మూవీస్ చేసేందుకు రెడీ అవుతున్నారు.