స్టార్ హీరోయిన్ సమంత చేతుల మీదుగా అవార్డ్ విన్నింగ్ మూవీ ‘ముత్తయ్య’ నుంచి ‘అరవైల పడుసోడు..’ సాంగ్ రిలీజ్, త్వరలో రిలీజ్ కు రాబోతున్న ‘ముత్తయ్య’

కె. సుధాకర్ రెడ్డి, అరుణ్ రాజ్, పూర్ణ చంద్ర, మౌనికా బొమ్మ ప్రధాన పాత్రల్లో నటించిన అవార్డ్ విన్నింగ్ మూవీ ‘ముత్తయ్య’. ఈ చిత్రాన్ని దర్శకుడు భాస్కర్ మౌర్య రూపొందించారు. హైలైఫ్ ఎంటర్టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్, ఫిక్షనరీ ఎంటర్టైన్మెంట్ ఎల్ఎల్పి బ్యానర్లపై వంశీ కారుమంచి, వృందా ప్రసాద్ సంయుక్తంగా నిర్మించారు. దివాకర్ మణి ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్ మరియు సహ నిర్మాతగా కూడా వ్యవహరించారు. త్వరలో ‘ముత్తయ్య’ సినిమా ఈటీవీ విన్ లో ప్రీమియర్ కు రెడీ అవుతోంది. ఈ రోజు స్టార్ హీరోయిన్ సమంత చేతుల మీదుగా ఈ సినిమా నుంచి ‘అరవైల పడుసోడు..’ పాటను రిలీజ్ చేశారు.

‘అరవైల పడుసోడు..’ పాటను మ్యూజిక్ డైరెక్టర్ కార్తీక్ రోడ్రిగ్వ్ సూపర్ హిట్ ట్యూన్ తో కంపోజ్ చేశారు. శివకృష్ణ చారి ఎర్రోజు క్యాచీ లిరిక్స్ రాయగా, విద్యాసాగర్ బంకుపల్లి ఆకట్టుకునేలా పాడారు. ‘అరవైల పడుసోడు..’ పాట ఎలా ఉందో చూస్తే – ‘అరవైల పడుసోడు ఎగిరెగిరి పడతాడు తుమ్మాకో తంబాకో తెలవదులేండి…. ఇరవైలా ముసలోడు ఎవ్వనికీ ఇనడీడు తుండేసి బండేసె ఆగం సుండి…. ఎర్రి సోమరికాడు ఎడ్డి కొండడుకాడు జర్ర కిర్రాకు జేస్తాడు మట్టున జూడు… మల్లీ సోపతిగాడు ఈడో ఎచ్చులపోడు
ఈళ్ళు ఓతాన కూడిన్రో అంగడె సూడు….’ అంటూ సాగుతుందీ పాట.

నటీనటులు – కె. సుధాకర్ రెడ్డి, అరుణ్ రాజ్, పూర్ణ చంద్ర, మౌనికా బొమ్మ, తదితరులు

టెక్నికల్ టీమ్

రచన, దర్శకత్వం – భాస్కర్ మౌర్య
నిర్మాతలు – వంశీ కారుమంచి, వృందా ప్రసాద్
బ్యానర్స్ – హైలైఫ్ ఎంటర్టైన్మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఫిక్షనరీ ఎంటర్టైన్మెంట్ ఎల్ఎల్పి
సహ నిర్మాత – దివాకర్ మణి
అసోసియేట్ నిర్మాత – హేమంత్ కుమార్ సిఆర్
పీఆర్ఓ – జీఎస్ కే మీడియా (సురేష్ – శ్రీనివాస్)
సినిమాటోగ్రాఫర్ – దివాకర్ మణి
సంగీతం- కార్తీక్ రోడ్రిగ్స్
ఎడిటర్ – సాయి మురళి
సౌండ్ డిజైన్ & మిక్సింగ్ – వంశీప్రియ రసినేని
ఎగ్జిక్యూటివ్ నిర్మాత – వెంకట్ కృష్ణ
ఆర్ట్ – బాలు