విజయ్ దేవరకొండ ఖుషి సినిమాలో మాధవన్!!

‘లైగర్’ తరువాత విజయ్ దేవరకొండ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ఖుషీ’. ప్రేమ కథా సినిమా గా రాబోతున్న ఈ సినిమా ను టాలీవుడ్ స్టార్ ప్రొడక్షన్ కంపనీ మైత్రీ మూవీ మేకర్స్ అత్యంత భారీ స్థాయిలో ఈ మూవీని నిర్మిస్తోంది. ఈ సినిమా ఎప్పుడో మొదలైనా కూడా ఇప్పుడు షూటింగ్ జరుపుకోవడం లేదు.

రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ మూవీకి శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తుండగా హీరోయిన్ గా రౌడీకి జోడీగా సమంత నటిస్తోంది. ఆమె అనారోగ్యం కారణంగా ఈ సినిమా వాయిదా పడుతూ వస్తుంది. కశ్మీర్ షెడ్యూల్ తో పాటు హైదరాబాద్ లో కొంత మేర షూటింగ్ జరుపుకున్న ఈ మూవీ తాజా షెడ్యూల్ సమంత అనారోగ్యం కారణంగా వాయిదా పడుతూ వస్తోంది.

త్వరలోనే ఈ సినిమా షూటింగ్ ను మొదలుపెట్టబోతుంది. తాజాగా ఈ సినిమా లో మాధవన్ నటించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఒకటి రెండు తెలుగు సినిమాల్లో ప్రేక్షకులను అలరించలేకపోయిన మాధవన్ ఈ సినిమా ద్వారా కం బ్యాక్ చేశాడా అనేది చూడాలి.