దివ్యాంగులకు ఆశ్రయం కల్పిస్తున్న ‘మనోధైర్య సంస్థాన్’ సేవా సంస్థ కొత్త ఇంటి నిర్మాణానికి సహాయం చేద్దాం

పలు సేవా కార్యక్రమాల్లో భాగమవుతూ తన మంచి మనసు చాటుకుంటున్నారు యంగ్ హీరో ఆకాష్ జగన్నాథ్. ఆయన తాజాగా మనోధైర్య సంస్థాన్ ఛారిటీ సంస్థకు తన వంతుగా సాయం అందించారు. ఎంతోమంది దివ్యాంగులకు ఆశ్రయం కల్పిస్తున్న ఈ సంస్థ కొత్త ఇంటి నిర్మాణానికి సాయం చేయాల్సిందిగా సోషల్ మీడియా ద్వారా పిలుపునిచ్చారు ఆకాష్ జగన్నాథ్. ఇక్కడ ఆశ్రయం పొందుతున్న దివ్యాంగులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు పొందడం విశేషం.

 

హీరో ఆకాష్ జగన్నాథ్ మాట్లాడుతూ – మనోధైర్య సంస్థాన్ సేవా సంస్థ వారు తాము చేస్తున్న సేవా కార్యక్రమాల గురించి వివరించి, ఒకసారి వారి సంస్థను సందర్శించమని కోరారు. నేను వెళ్లి చూశాను. ఎంతోమంది దివ్యాంగులు ఇక్కడ ఆశ్రయం పొందుతున్నారు. వారిలో పది మంది బాగా చదువుకుని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు పొందారు. వారు ఓనర్స్ అవసరాల మేరకు ఇప్పుడున్న ఇంటిని ఖాళీ చేయాల్సివస్తోంది. ఈ సంస్థ దాతల సహాయంతో కొత్త ఇంటిని నిర్మాణం చేపట్టారు. ఈ ఇంటి నిర్మాణానికి నా వంతుగా నేను ఆర్థిక సాయం చేశాను. మీరు కూడా మీకు తోచినంత సాయం చేయాలని కోరుతున్నా. మనం ఎన్నో ఖర్చు చేస్తుంటాం. ఇలాంటి దివ్యాంగులకు సాయం చేస్తే వారు జీవితాల్లో వెలుగు నింపిన వారం అవుతాం. అన్నారు.

 

తమ సంస్థకు ఆర్థిక సాయం చేయడమే కాకుండా విరాళాల కోసం ప్రచారం చేస్తున్న హీరో ఆకాష్ జగన్నాథ్ కు మనోధైర్య సంస్థాన్ నిర్వాహకులు, ఆశ్రయం పొందుతున్న దివ్యాంగులు కృతజ్ఞతలు తెలిపారు.